Official Website Click Here
CASTE WISE POSTS LIST Download Here
DISTRICT WISE POSTS LIST Download Here
Note : Syllabus Released - 20-04-2025
DSC 2024 - SGT _ సిలబస్ తెలుగులో Download Here
AP DSC:
ఏపీ డీఎస్సీకి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా.?
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి
డీఎస్సీ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపారు.
జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు కంప్యూటర్ విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
అన్ని పరీక్షలు నిర్వహించన తర్వాత తుది కీ విడుదల, అభ్యంతరాలు స్వీకరణ వంటి ప్రక్రియ చేపట్టనున్నారు.
జులై నెలాఖరులోగా ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేసి ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అంటే మళ్లీ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్త ఉద్యోగులు బాధ్యతలు స్వీకరిచంచనున్నారన్నమాట.
డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం మంత్రి నారో లోకేష్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయడం మొదలు, సబ్‌మిషన్ వరకు ప్రాసెస్‌ను వీడియో స్పష్టంగా వివరించారు.
డీఎస్సీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా డిపార్ట్‌మెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం పైన కనిపించే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* కొత్త యూజర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయగానే ఓ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో పేర్కొన్న సంబంధిత అంశాలను అందించి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలి.
* యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వచ్చిన తర్వాత డీఎస్సీ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ అవ్వాలి.
* సెక్షన్‌లో 1 దీనిలో మీ ప్రొఫైల్ సమాచారం ఉంటుంది.
అదే విధంగా సెక్షన్ 2లో మీ అకడమిక్ క్వాలిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను అందించాలి.
* ఇందులో మీ స్కూల్ మొదలు డిగ్రీ, బీఈడీ వివరాలను అందించాలి.
ఇందుకోసం సంబంధిత హాల్ టికెట్లు, మార్కుల వివరాలను అందించాల్సి ఉంటుంది.
* ప్రాసెస్‌లో భాగంగా మీ ఏపీ టెట్ క్వాలిఫికేషన్ వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు, ఎన్ని మార్కులు వచ్చాయి, హాల్ టిటెక్ ఏంటి.? వంటి వివరాలను అందించాలి.
* అదనంగా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయాలి.
* అన్ని వివరాలను అందించిన తర్వాత చివరిలో చెక్ బాక్స్‌కు టిక్ చేసి వెరిఫై చేయాలి.
సెక్షన్ 3:
* సెక్షన్ 3లో మీరు కోరుకునే జిల్లా, జోన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* మీరు ఎంచుకున్న లొకేషన్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను సిస్టమ్ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది.
* అనంతరం కనిపించే అప్ అండ్ డౌన్ గుర్తుల ద్వారా మీ జిల్లాల ఆప్షన్స్ ఆర్డర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
* ఆప్షన్స్ సెలక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మొత్తం 5 సెంబర్లను సెలక్ట్ చేసుకోవాలి.
* అన్ని వివరాలను సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మీరు ఎన్ని స్థానాలకు అప్లై చేస్తున్నారు అన్న వివరాలతో కూడిన ఒక అలర్ట్ వస్తుంది. చెక్ చేసుకొని ప్రోసీడ్ టూ పే అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* వెంటనే పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ మెథడ్స్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.
* మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ అప్‌లోడింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
* చివరిగా అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి.

